Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా..?

Chandrayan-2, చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా..?

ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. జూలై 15న దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ సైంటిస్టులు గత 15 రోజులుగా షార్‌లో ఆర్బిటర్, రోవర్, ల్యాండర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. గురువారం వ్యాబ్‌లో జీఎస్ఎల్వీ మార్క్ 3 వాహక నౌకలో వీటిని అమర్చారు. శనివారం దీనికి తుది పరీక్షలు నిర్వహించి ల్యాండర్, ఆర్బిటర్, రోవర్‌ల పనితీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

ఆదివారం ఈ వాహకనౌకను రెండో ప్రయోగ వేదికకు తీసుకొచ్చి పూర్తి స్ధాయిలో అనుసంధానం చేసి గ్లోబుల్ చెక్స్, ఫేజ్-3 , లెవెల్ 1,2 చెకింగ్స్ చేస్తారు. రెండో ప్రయోగవేదికపైనే వారం రోజులపాటు పలు రకాల పరీక్షలు నిర్వహించి జూలై 15 తెల్లవారుజామున 2. 51 గంటలకు చంద్రయాన్ -2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.

ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి చంద్రయన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగాచూసే వీలుకల్పించింది ఇస్రో. దీనికోసం ఆన్‌లైన్‌లో ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వివరాలను www.isro.gov.in ద్వారా నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుది. దాదాపు 10 వేలమందికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

Related Tags