చంద్రయాన్2 తొలి ప్రక్రియ సక్సెస్

చంద్రయాన్-2 ప్రయోగంలో మొదటి ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నెల 22న భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఆగస్టు 20 వరకు చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరుతుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ మొదటి భూస్థిర కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్2 కక్ష్యను పెంచేందుకు బుధవారం మధ్యాహ్నం 48 సెకండ్ల పాటు దాని ఇంజిన్లను మండించినట్లు వెల్లడించారు. ఈ నెల 26న ఉదయం 2.52 గంటలకు మళ్లీ ఇదే ప్రక్రియతో కక్ష్యను పెంచుతామని తెలిపారు. […]

చంద్రయాన్2 తొలి ప్రక్రియ సక్సెస్
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 8:31 AM

చంద్రయాన్-2 ప్రయోగంలో మొదటి ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నెల 22న భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఆగస్టు 20 వరకు చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరుతుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ మొదటి భూస్థిర కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్2 కక్ష్యను పెంచేందుకు బుధవారం మధ్యాహ్నం 48 సెకండ్ల పాటు దాని ఇంజిన్లను మండించినట్లు వెల్లడించారు. ఈ నెల 26న ఉదయం 2.52 గంటలకు మళ్లీ ఇదే ప్రక్రియతో కక్ష్యను పెంచుతామని తెలిపారు.

భూమిచుట్టూ తిరుగుతున్న చంద్రయాన్ 2 కక్ష్యను క్రమంగా పెంచుతూ పోవడం, దానిని చంద్రుడి కక్ష్యలోకి చొప్పించడం, తర్వాత చంద్రుడి స్థిర కక్ష్యలోకి ప్రవేశింప జేయడం, చంద్రయాన్ 2 నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోవడం వంటివి ఈ ప్రయోగంలో కీలక దశలు అన్నారు. ఈ నెల 22న జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా దీర్ఘ వృత్తాకార కక్ష్యలో చంద్రయాన్‌ను ప్రవేశపెట్టింది ఇస్రో. ఆగస్ట్ 14న చంద్రుడు పరిభ్రమిస్తున్న కక్ష్యలోకి చంద్రయాన్ 2 ప్రవేశిస్తుంది. ఆగస్టు20 నాటికి చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరుతుంది.