చంద్రయాన్-2: మరో వారం రోజుల్లో.. జాబిల్లి ఉపరితలం పైకి..

Chandrayaan-2 Enters Lunar Trajectory For Straight Journey To Moons Orbit

భారత అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఇస్రో ఎంతో ప్రయోగాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో వారం రోజుల్లో అంటే ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. నేడు తెల్లవారుజామున చేపట్టిన కీలకమైన ప్రక్రియ ద్వారా వ్యోమనౌక పూర్తి స్థాయిలో భూ కక్ష్యను విడిచిపెట్టింది. అయితే ప్రయోగం చేపట్టిన 23 రోజుల తర్వాత చంద్రయాన్ 2 కీలకమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. గత నెల 22న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే వ్యోమ నౌక సెప్టెంబర్ 7న జాబిల్లి ఉపరితలంపై కాలు మోపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *