చంద్రయాన్‌-2: చంద్ర బిలాలను చిత్రీకరించిన ఆర్బిటర్‌ కెమెరా

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 అప్పుడే చంద్రునిలోని అనేక విశేషాలను భూమికిచేర వేస్తోంది. మరికొద్దిరోజుల్లోనే చంద్రుని పై రోవర్‌ కాలుమోపనుంది. తాజాగా కక్ష్యలో పరిభ్రమిస్తున్న మాడ్యూల్‌ అత్యంత విలువైన సమాచారాన్నిచేరవేసింది. చంద్ర‌యాన్‌2 గురించి ఇస్రో కొత్త అప్‌డేట్ ఇచ్చింది. చంద్ర‌యాన్‌2 వ్యోమ‌నౌక‌లో ఉన్న టెర్రేయిన్ మ్యాపింగ్ కెమెరా-2(టీఎంసీ-2) తీసిన ఫోటోల‌ను ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్రయాన్‌2లో ఉన్న కెమెరాకు ఈ ఫోటోలు చిక్కాయి. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న అగాధాల‌ను ఆ కెమెరా […]

చంద్రయాన్‌-2: చంద్ర బిలాలను చిత్రీకరించిన ఆర్బిటర్‌ కెమెరా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 27, 2019 | 6:49 AM

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 అప్పుడే చంద్రునిలోని అనేక విశేషాలను భూమికిచేర వేస్తోంది. మరికొద్దిరోజుల్లోనే చంద్రుని పై రోవర్‌ కాలుమోపనుంది. తాజాగా కక్ష్యలో పరిభ్రమిస్తున్న మాడ్యూల్‌ అత్యంత విలువైన సమాచారాన్నిచేరవేసింది. చంద్ర‌యాన్‌2 గురించి ఇస్రో కొత్త అప్‌డేట్ ఇచ్చింది. చంద్ర‌యాన్‌2 వ్యోమ‌నౌక‌లో ఉన్న టెర్రేయిన్ మ్యాపింగ్ కెమెరా-2(టీఎంసీ-2) తీసిన ఫోటోల‌ను ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్రయాన్‌2లో ఉన్న కెమెరాకు ఈ ఫోటోలు చిక్కాయి.

చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న అగాధాల‌ను ఆ కెమెరా చిత్రీక‌రించింది. జాక్స‌న్‌, మాచ్‌, కొర‌లేవ్‌, మిత్రా లాంటి క్రేట‌ర్స్ క‌నిపించిన‌ట్లు ఇస్రో చెప్పింది. మిత్రా అగాధానికి ప్రొఫెస‌ర్ సిసిర్ కుమార్ మిత్ర పేరు పెట్టారు. ప్రొఫెస‌ర్ మిత్రా భూగోళ శాస్త్ర‌వేత్త‌. ఆయ‌న‌కు ప‌ద్మ భూష‌న్ అవార్డు కూడా ఇచ్చారు. ఐయ‌నోస్పియ‌ర్‌, రేడియోఫిజిక్స్‌లో ప్రొఫెస‌ర్ మిత్రా అద్భుత‌మైన అధ్య‌య‌నాలు చేశారు. అయితే ఈ క్రేట‌ర్స్ అన్నింటినీ చంద్ర‌యాన్‌2లోని కెమెరా సుమారు 4375 కిలోమీట‌ర్ల దూరం నుంచి తీసింది. జాక్స‌న్ లోయ చంద్రుడి ఉత్త‌ర ద్రువం వైపున ఉన్న‌ది. అది సుమారు 71 కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంది. మిత్రా క్రేట‌ర్ సుమారు 92 కిలోమీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంది. అలాగే చంద్రుని పై సౌర మచ్చల చిత్రాలను కూడా ఇస్రో విడుదల చేసింది.