బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలి.. పంచాయతీ ఎన్నికలపై టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఎస్‌ఈసీకి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. వీలైనన్నీ ఎక్కువ స్థానాలు..

బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలి.. పంచాయతీ ఎన్నికలపై  టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం
Follow us

|

Updated on: Jan 27, 2021 | 12:19 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఎస్‌ఈసీకి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. వీలైనన్నీ ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ వైసీపీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంతో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అలర్ట్‌ అయింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తమ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎవరూ అధైర్య పడొద్దని పార్టీ ప్రజా ప్రతినిధులు, మండల, గ్రామ కమిటీ సభ్యులకు సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని సూచించారు. నామినేషన్ల తొలి రోజే వీలైనన్ని ఎక్కువ నామినేషన్లు దాఖలు చేయాలన్నారు.

అభ్యర్థులందరూ అవసరమైన ధ్రువపత్రాలను ముందే రెడీ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థుల కోసం 24 గంటలూ పనిచేసేలా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఆలయాలపై దాడులతో వైసీపీ అన్ని వర్గాలకు దూరమైందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి ఖాయమని శ్రేణులకు ధైర్యం చెప్పారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!