బాబుకు తలనొప్పిగా మారిన.. తెలుగు తమ్ముళ్లు..!

TDP leaders Up In Arms Against AP MLA Kodela Siva Prasad Rao

ఎన్నికల్లో ఓటమి పాలవరడంతో.. వైసీపీ, బీజేపీ నేతల ఆరోపణలను ఎలా ఎదుర్కొవాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబుకు.. కోడెల కుటుంబ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. ఎన్నికలప్పటి నుంచే కోడెల ఫ్యామిలీ ఇష్యూ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఆ ఆసమ్మతి మరీ పీక్ చేరి మాకొద్దు మహాప్రభో అని చంద్రబాబుకే మొరపెట్టుకున్నారు మరో వర్గం నేతలు. కోడెలని సత్తెనపల్లి నుంచి తప్పిస్తేనే పార్టీ బతుకుతుంది లేకుంటే అంతే అంటున్నారట మరో వర్గం నేతలు. ఇక వీరిని వారిస్తే ఒక తంటా.. సైలెంట్‌గా ఉంటే మరో చిక్కు. ఏం చేయాలో తోచక ఇబ్బందిపడుతున్నారట చంద్రబాబు. మరోవైపు అధికార పార్టీ మీద పోరాటానికి పార్టీ క్యాడర్‌ని సిద్ధం చేయడం మీద చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అయితే సత్తెనపల్లిలో మాత్రం సీన్‌ రివర్స్‌లో ఉంది. కార్యకర్తలు, నేతల్లో సమరోత్సాహం ఉంది కానీ…అది సొంత పార్టీ నేత మీదే. దీంతో చంద్రబాబు కోడెల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *