బెట్టింగ్​లు వేసినంత ఈజీ కాదు.. పోలవరం నిర్మాణం : చంద్రబాబు

Chandrababu fires on ysrcp due to polavaram

పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే… కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్​లు నిర్వహించినంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలోనూ టెక్నికల్ కమిటీలు ఉంటాయని…కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందని గుర్తు చేశారు. ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారని, ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *