మమ్మల్ని విమర్శించి.. మీరు చేస్తున్నదేంటి..?: బాబు ఫైర్

మమ్మల్ని విమర్శించి, మీరు చేస్తున్నదేంటని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వైసీపీ విమర్శించి.. ఇప్పుడు విశాఖలో ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని.. మాకెందుకు అనుకుంటే నష్టపోయేది ప్రజలేనని బాబు పేర్కొన్నారు. నియంతృత్వ పోకడలను ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని ఆయన సూచించారు. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని.. కార్యాలయాలు కట్టినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందదని […]

మమ్మల్ని విమర్శించి.. మీరు చేస్తున్నదేంటి..?: బాబు ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 03, 2020 | 8:00 PM

మమ్మల్ని విమర్శించి, మీరు చేస్తున్నదేంటని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వైసీపీ విమర్శించి.. ఇప్పుడు విశాఖలో ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని.. మాకెందుకు అనుకుంటే నష్టపోయేది ప్రజలేనని బాబు పేర్కొన్నారు. నియంతృత్వ పోకడలను ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని ఆయన సూచించారు. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని.. కార్యాలయాలు కట్టినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందదని బాబు అన్నారు. మూడు రాజధానులుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికెళ్లాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వలన రూ.79వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆయన విమర్శించారు. విశాఖలో ఎయిర్‌పోర్ట్, మెట్రో రైలు, సుజల స్రవంతిని వదిలేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అని బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అయిన అజయ్ కల్లమ్ నారావారి పల్లె సభలో ఎందుకు పాల్గొన్నారని.. రాజకీయాలంటే అంత ఆసక్తి ఉంటే ఆయన వైసీపీలో చేరాలని బాబు అన్నారు.