బాబు గౌరవప్రదంగా ఇల్లు ఖాళీ చేయాల్సిందే..!

‘ప్రజావేదిక కూల్చివేత’.. ఏపీలో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్. అనంతరం అక్రమ కట్టడంగా నిర్మించిన చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేస్తారా..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు..? ఏపీలోని పరిణామాలు ఎలా ఉంటాయన్నది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు.

ఒక పక్క ప్రజావేదిక కూల్చివేత చాలావరకు పూర్తి అయింది. మరోపక్క కలెక్టర్ల విస్తృత సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్నాయి. కలెక్టర్లకు సీఎం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఖరాఖండిగా ఆదేశాలిచ్చారు. దానిని అధికారులు కూడా అమలు పరుస్తున్నారు. అయితే.. ఇప్పుడు చిక్కల్లా చంద్రబాబు నివాసాన్ని కూలుస్తారా..? అన్నదానిపై స్పందించిన మంత్రి అనికుమార్ యాదవ్.. ఇళ్లు కూల్చాల్సివస్తే.. మాజీ సీఎం తాను నివాసముంటున్న భవనాన్ని తానే ఖాళీ చేస్తే గౌరవప్రదంగా ఉటుందని వ్యాఖ్యానించారు. ఆ ఇల్లు అక్రమ కట్టడమని తేలితే ఖచ్చితంగా దాన్ని కూల్చేస్తామని స్పష్టం చేశారు. దీంతో.. ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు కూడా మరో హాట్ టాపిక్‌కు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *