Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్. పిటిషన్ దాఖలు చేసిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు . ప్రస్తుతం విజయవాడలో జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు. వెంటనే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది. ఇప్పటికే ఏసీబీ కస్టడీ కూడా ముగిసిందని పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది. ఏసీబీ కోర్టు బెయిల్ పిటీషన్ ను సస్పెండ్ చేయడంతో హైకోర్టు ను ఆశ్రయుంచిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు.
  • హైదరాబాద్ కమిషనరేట్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో జరిగిన మైనర్ రేప్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైల్ శిక్ష విధించిన కోర్టు.
  • కృష్ణజిల్లా: మచిలీపట్నం సబ్ జైలు నుంచి కొల్లు రవీంద్రను రాజమండ్రి తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అనుమతి. గత రెండురోజులుగా మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్ర. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు. అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన. సబ్ జైలుకు చేరుకుని నల్ల బ్యార్జ్ లతో నిరసన. భారీ బందోబస్తు తో కొల్లు రవీంద్ర ను తరలించిన పోలీసులు.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో కేటుగాడు అరెస్ట్. నకిలీ ఈపాస్ లు సృష్టించిన కేసులో అరెస్ట్. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన పవన్ కుమార్ గా గుర్తింపు. 73 మందికి ఫోర్జరీ చేసిన ఈపాస్ లు ఇచ్చినట్టు నిర్దారణ. హైదరాబాద్ లోని ఓ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేస్తున్న పవన్.
  • దేశ రాజధాని ఢిల్లీలో లక్ష దాటిన కరోనా కేసులు. 1,00,823కి చేరుకున్న మొత్తం ఢిల్లీ కేసుల సంఖ్య. గత 24 గంటల్లో 1,379 కొత్త కేసులు నమోదు. ఇందులో 72,088 మంది కోలుకుని డిశ్చార్జవగా, 25,620 యాక్టివ్ కేసులు. ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 3,115.

అమరావతి ఎంపిక అందుకే.. సీక్రెట్ రివీల్ చేసిన చంద్రబాబు

chandrababu revealed amaravati secret, అమరావతి ఎంపిక అందుకే.. సీక్రెట్ రివీల్ చేసిన చంద్రబాబు

అయిదేళ్ళ క్రితం రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోతే…తాను అన్నీ ఆలోచించే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశామన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అమరావతి ఒక ఆశగా కనిపించాలి, ఓ దిక్సూచిగా నిలవాలనే ఉద్దేశంతో దీని చుట్టూ సంపద సృష్టించాలన్న సంకల్పంతోనే అమరావతిని ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆఖరు రోజున రాజధాని అంశంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. విజయవాడలో కేపిటల్ పెడుతున్నామని తాము చెప్పినప్పుడు అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ కూడా తమతో ఏకీభవించారని గుర్తు చేశారాయన. రాజధాని ఎక్కడన్నా పెట్టండి.. కానీ కనీసం 30వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ ఆనాడు సూచించారని చెప్పారు చంద్రబాబు.

ఈసందర్భంలో జరిగిన గందరగోళంతో చంద్రబాబు చిరాకు పడ్డారు. హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేసిన ఘనత తనదేనని, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు చంద్రబాబు.

అమరావతి ఎంపిక ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దృష్టి ఏర్పాటు చేశారన్న ప్రచారాన్ని ఖండించారు. అమరావతి ఏరియాలో బలహీన వర్గాలే అధిక సంఖ్యలో వున్నాయన్నారు చంద్రబాబు. వెస్టెడ్ ఇంట్రెస్టులున్నాయి కాబట్టే అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుందంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు సభలో దుమారాన్ని రేపాయి.

అమరావతి ఏరియాలో తన వాళ్ళకు భూములున్నాయన్న ఆరోపణలో నిజం లేదని, అలా వుంటే ఏ చర్య అయినా ప్రభుత్వం తీసుకోవచ్చని చంద్రబాబు సవాల్ చేశారు.

Related Tags