#Chandrababu సీఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్నల వర్షం

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అది కూడా కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సందర్భంలో అదే అంశాన్ని ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి ప్రశ్నలు సంధించారు చంద్రబాబు.

#Chandrababu సీఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్నల వర్షం
Follow us

|

Updated on: Mar 16, 2020 | 7:02 PM

Chandrababu thrown series of questions on CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అది కూడా కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సందర్భంలో అదే అంశాన్ని ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి ప్రశ్నలు సంధించారు చంద్రబాబు. కరోనా ప్రభావం కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రశ్నాస్త్రాలను సంధించడం విశేషం.

ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేదన్న నిర్లక్ష్యం ప్రభుత్వాధినేతల్లో కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. క‌రోనాపై ప్ర‌జ‌లంద‌రు అప్ర‌మ‌త్తంగా ఉండాలని, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అదే సమయంలో సీఎం జగన్‌కు ప్రశ్నలు సంధించారు. క‌రోనా నివార‌ణకు ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకుందని ఆయన నిలదీశారు.

6777 మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చారని.. వారి వివరాలు ప్రభుత్వం వద్ద వున్నాయా అని అడిగారు చంద్రబాబు. 14 రోజుల వ‌ర‌కు ఆబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టాలి..పెట్టారా…? అని ప్రశ్నించారు. వారందరికీ వైద్య ప‌రీక్ష‌లు చేయాలి..చేశారా…? అని క్వశ్చన్ చేశారాయన. క‌నీసం మ‌నుషుల్ని గుర్తించారా..? అన్న చంద్రబాబు ప్ర‌జ‌ల ఆరోగ్యంతో ఆడుకునే హ‌క్కు మీకెక్క‌డిది…? అంటూ జగన్‌ను నిలదీశారు. ఏపీలో కరోనా లేద‌ని స‌ర్టిఫై చేయ‌డానికి మీరేవ‌రు..? అని ప్రశ్నించిన చంద్రబాబు ప్రజారోగ్యం ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. రెండు నెల‌లు ఎన్నిక‌లు ఆల‌స్యం అయితే ఏం అవుతుందని అడిగిన చంద్రబాబు.. మ‌నుషుల ఆరోగ్యం కంటే ఎన్నిక‌లు ఎక్కువా అని క్వశ్చన్ చేశారు.