Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

మోదీతో వైరమే కొంప ముంచింది..చంద్రబాబు కొత్త స్టాండ్ ?

chandrababu regrets for his stand, మోదీతో వైరమే కొంప ముంచింది..చంద్రబాబు కొత్త స్టాండ్ ?

చంద్రబాబునాయుడులో నిర్వేదం ఆవహించిందా ? విశాఖలో పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన చేసిన మాటలు నిర్వేదానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతోను, అక్కడ అధికారంలో వున్నబిజెపి అధినేతలతోను విభేదించడం.. వారిపై రాజకీయ పోరాటం చేయడమే తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకరకంగా చెప్పాలంటే కేంద్రంతోను, మోదీతోను నాడు జరిపిన పోరాటం పట్ల చంద్రబాబు గిల్టీ ఫీలవుతున్నట్లు మాట్లాడారు చంద్రబాబు.

2014 ఎన్నికల్లో బిజెపితో చెలిమి చేసిన చంద్రబాబు అప్పట్లో ఊపుమీదున్న వైసీపీపై కొద్దో గొప్పో ఆధిక్యంతో అధికారం పొందారు. నాలుగేళ్ళపాటు చంద్రబాబు, మోదీ కలిసే కొనసాగారు. అందులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం.. రాజధాని భూమి పూజ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టడం జరిగాయి. భూమి పూజ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. పవిత్ర గంగాజలాన్ని, పవిత్ర మట్టిని తీసుకువచ్చారు. ఆ సందర్భంలో బిజెపియేతర పక్షాలన్నీ రాజధాని నిర్మాణానికి ప్రధాని ఇచ్చింది పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళు అని ఎద్దేవా చేసినా.. చంద్రబాబు మోదీకి మద్దతుగానే నిలిచారు.

కానీ కాలక్రమేణా ఎన్నికలు దగ్గరవుతుండడంతో యాంటి ఎస్టాబ్లిష్ మెంట్ ఫ్యాక్టర్ని తగ్గించుకునే వ్యూహంతో చంద్రబాబు బిజెపికి దూరం జరగడం మొదలుపెట్టారు. కేంద్రం చెప్పిందొకటి.. చేసిందొకటి అంటూ ఏపీకి మోదీ తీవ్ర అన్యాయం చేశారని కామెంట్ చేయడం ప్రారంభించారు. తమ ఎంపీలతో ఢిల్లీపై యుద్దం ప్రకటించారు. బాబు వైఖరి పట్ల మోదీతోపాటు బిజెపి అధినాయకత్వం ఆగ్రహం చెందినా.. హుందాగానే వున్నారు. అదే సమయంలో చంద్రబాబు బిజెపితోను, మోదీతోను అమీతుమీ తేల్చుకునేందుకు శక్తి మేరకు ప్రయత్నాలు చేశారు. చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టేంత తీవ్ర నిర్ణయానికి చంద్రబాబు వెనుకాడలేదు. అదే సమయంలో బిజెపీయేతర వర్గాలు కూడగట్టడం కోసం దేశం మొత్తం కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. మోదీ బద్ద శత్రువులైన మమతాబెనర్జీ, స్టాలిన్, వామపక్షాల నేతలను ఒక్కతాటిపైకి తేవడం ద్వారా ఓట్ల పోలరైజేషన్కు ప్రయత్నించారు.

ఇంతా చేస్తే.. మోదీ హవాను కాస్తైనా తగ్గించలేకపోయారు చంద్రబాబు. కారణాలేవైనా కావచ్చు గాక.. లోక్ సభ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాల వ్యూహమే గెలిచింది. 2014 కన్నా  ఎక్కువ స్థానాలలో బిజెపి విజయఢంకా మోగించింది. ఎన్నికల్లో గెలుపోటములు మామూలే. కానీ.. ఇపుడున్న ట్రెండ్ లో ఒక్క ఓటమే పార్టీ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఓడిన పార్టీ వచ్చే అయిదేళ్లు పార్టీని, క్యాడర్ ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. ఇపుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి సరిగ్గా అలాగే వుంది. క్యాడర్ వైసీపీ, బిజెపిల వైపు వెళుతుంటే అధినేత స్వయంగా బుజ్జగించి ఆపాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు విశాఖ జిల్లా సమీక్షలో కీలకమైన కామెంట్ చేయడం విశేషం. మోదీతోను, కేంద్రంతోను పోరాటం చేయడం ప్రతికూల ఫలితాలకు కారణమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకున్న స్టాండ్ పట్ల రిగ్రెట్ అయ్యారు. చంద్రబాబు వైఖరి దేనికి సంకేతం అని పరిశీలకులు విశ్లేషణలో పడ్డారు. మరోసారి బిజెపితో చెలిచి చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారా ? ఒకవేళ బాబు అందుకు సిద్దపడ్డా.. మోదీ అందుకు సుముఖత చూపుతారా ? ఇలాంటి విశ్లేషణలకు ఇపుడు వెబ్ సైట్లు వేదికలవుతున్నాయి. అందుకే కదా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరని అంటారేమో.

Related Tags