Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

చంద్రబాబు కొత్త ఎత్తుగడ.. వివరాలు తెలిస్తే షాకే..!

Chandrababu New Plan Over Politics Here Are The Details, చంద్రబాబు కొత్త ఎత్తుగడ.. వివరాలు తెలిస్తే షాకే..!
ఏపీలో టిడిపి నేతల పాట్లు అన్నీ, ఇన్నీ కావనిపిస్తున్నాయి. అసలే ఎన్నికల్లో దారుణ పరాజయం.. ఆ తర్వాత జంప్ జిలానీలతో ఏపీ టిడిపి కుదేలైపోతోంది. రోజుకో నేత చేజారుతున్నారన్న వార్త టిడిపి క్యాడర్‌నే కాదు.. అధినేతను కూడా కలవరపరుస్తోంది. అయిదేళ్ళు ప్రతిపక్షంలో నెట్టుకొచ్చి.. ఆ తర్వాతైనా తనయుడిని ముఖ్యమంత్రిని చేద్దామనుకున్న చంద్రబాబు కలకు జంప్ జిలానీలు చెక్ పెట్టే ప్రమాదం వుండడంతో కొత్త ఎత్తు వేశారు టిడిపి అధినేత.
ఎన్నికల్లో గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలు. ఈ నెంబర్‌పై టిడిపి, వైసీపీ మధ్య నడిచి డైలాగ్ వార్ కూడా గమ్మత్తైనదే. అయితే.. ఇప్పుడు ఈ నెంబర్‌ని కాపాడుకోవడం చంద్రబాబుకు తలకు మించిన పనిగా మారింది. వల్లభనేనితో మొదలైన జంపింగ్ జపాంగ్‌ పరంపర గంటాని దాటుకుని అలా వెళుతుందని, సుమారు 16 మంది టిడిపి ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని వైసీపీకి చెందిన నారాయణ స్వామి లాంటి వారు పేలుస్తున్న బాంబులపై పైకి డాబు ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం టిడిపి అధినాయకత్వం కలవరపడుతూనే వుందంటున్నారు.
ఒక్క ఎమ్మెల్యేలే కాకుండా.. ఓడిన వారు, సాధారణ నేతలు కూడా మంచి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న పరిస్థితి టిడిపి అధినాయకత్వాన్ని కలవరపరిచేదే. దానికి తోడు సమస్యల్లో వున్నప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ కొందరు రాసిన నేపథ్యంలో కష్టాల్లో ఉన్న క్యాడర్‌ని, లీడర్లను పరామర్శించడం.. వీలైనంత మేరకు సహాయం చేయడం, చేయూత నందించడం.. ఇదే ఇప్పుడు పార్టీని పరిరక్షించుకునే వ్యూహంలో చంద్రబాబు టేకప్ చేసిన యాక్షన్ ప్లాన్ అని తెలస్తోంది. ఇటీవల వల్లభనేని వంశీ కూడా చంద్రబాబుకు రాసిన లేఖలో తాను పడుతున్న ఇబ్బందులు ప్రస్తావించి వాపోయారు.
టిడిపిలో అత్యంత వివాదాస్పద నేత ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చేది దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పార్టీ అధికారంలో వున్నప్పుడు చెలరేగిపోయిన చింతమనేని మీద ఇప్పటికే 60కి పైగా కేసులున్న మాట తెలిసిందే. ఒక కేసు కాకపోతే ఇంకోటి అలా చింతమనేని జైలుకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చింతమనేని కుటుంబాన్ని, జైల్లో వున్న చింతమనేనిని పరామర్శించే నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ చింతమనేనిని కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఇది జరిగిన వెంటనే తాజాగా అనంతపురం ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  జిల్లా జైలులో ఉన్న చింతమనేని పరామర్శించేందుకు వచ్చారు. పార్టీ పట్టించుకుంటుందన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇవ్వడం ద్వారా కష్టాల్లో వున్న వారు పార్టీని వీడే ఆలోచన నుంచి మనసు మార్చుకోవాలన్న మెసేజ్ ఇవ్వడమే ప్రస్తుతం చంద్రబాబు తీసుకున్న కొత్త ఎత్తుగడ. మరి ఈ ఎత్తుగడ పార్టీ మారే వారిలో ఎందరిని ఆపుతుందో వేచి చూడాలి.