మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ

Chandrababu Naidu Babu meets Murali Mohan, మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ

ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ నటుడు మురళీమోహన్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆయనను కలిసి.. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌తో చంద్రబాబు నాయుడు కాసేపు ముచ్చటించారు. మరోవైపు మురళీమోహన్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్‌లో పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుగొన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా మురళీమోహన్‌ను కలిసిన విషయం తెలిసిందే.

Chandrababu Naidu Babu meets Murali Mohan, మురళీమోహన్‌కు చంద్రబాబు పరామర్శ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *