డిప్లొమాటిక్ పాస్‌పోర్టు అప్పగించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా జారీ చేసిన డిప్లొమాటిక్(డీ టైప్)పాస్‌పోర్టును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులకు అప్పగించారు. బుధవారం మద్యాహ్నం విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందితో వెళ్లిన ఆయన.. ఆ పాస్‌పోర్టును అప్పగించి, సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు. పది నిమిషాల్లో ఆయన పని పూర్తి చేసుకున్నారు. కాగా ఆ సమయంలో బాబుతో ఫొటోలు తీసుకునేందుకు కొంతమంది ఉత్సాహాన్ని చూపడంతో మరో పది నిమిషాలు ఆయన అక్కడే […]

డిప్లొమాటిక్ పాస్‌పోర్టు అప్పగించిన చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 10:22 AM

ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా జారీ చేసిన డిప్లొమాటిక్(డీ టైప్)పాస్‌పోర్టును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులకు అప్పగించారు. బుధవారం మద్యాహ్నం విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందితో వెళ్లిన ఆయన.. ఆ పాస్‌పోర్టును అప్పగించి, సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు. పది నిమిషాల్లో ఆయన పని పూర్తి చేసుకున్నారు. కాగా ఆ సమయంలో బాబుతో ఫొటోలు తీసుకునేందుకు కొంతమంది ఉత్సాహాన్ని చూపడంతో మరో పది నిమిషాలు ఆయన అక్కడే గడపాల్సి వచ్చింది. కాగా ముఖ్యమంత్రులు, ప్రత్యేక అధికారుల కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్లొమాటిక్ పాస్‌పోర్టును జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు నాయుడు ఆ పాస్‌పోర్టును పొందగా.. ఇప్పుడు పదవి పోయిన సమయంలో ఆయన దాన్ని అధికారులకు ఇచ్చేశారు.