వైసీపీ నేతలను మేపడానికేగా ఇదంతా: బాబు ఫైర్

ఏమిటీ పిల్లల ఆటలు అంటూ సీఎం జగన్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేసిన బాబు.. ‘‘వ్యవస్థలో మార్పు తేవాలంటే ముందు ఒక ప్రణాళిక తయారుచేసుకొని సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, అప్పుడు పాత వ్యవస్థను రద్దు చేయడమో, మార్పు చేయడమో చేయాలి. అదేమీ లేకుండా వచ్చీరావడంతోనే పాత ఇసుక విధానాన్ని రద్దు చేసేశారు. కొత్త విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందట. ఏమిటీ పిల్లల ఆటలు? బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, […]

వైసీపీ నేతలను మేపడానికేగా ఇదంతా: బాబు ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 07, 2019 | 7:58 AM

ఏమిటీ పిల్లల ఆటలు అంటూ సీఎం జగన్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్వీట్ చేసిన బాబు.. ‘‘వ్యవస్థలో మార్పు తేవాలంటే ముందు ఒక ప్రణాళిక తయారుచేసుకొని సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, అప్పుడు పాత వ్యవస్థను రద్దు చేయడమో, మార్పు చేయడమో చేయాలి. అదేమీ లేకుండా వచ్చీరావడంతోనే పాత ఇసుక విధానాన్ని రద్దు చేసేశారు. కొత్త విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందట. ఏమిటీ పిల్లల ఆటలు? బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, మొండిగా నిర్ణయాలు తీసేసుకోవడమేనా? పర్యవసనాలు ఆలోచించక్కర్లేదా? ఇసుక కొరత మూలంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రజల సొంతింటి కలలు కడతేరిపోయాయి. ట్రాక్టర్ ఇసుక రూ.10,000 అంటే వైసీపీ నేతలను మేపడానికేగా ఇదంతా’’ అని కామెంట్ పెట్టారు.

ఆ తరువాత అన్నక్యాంటీన్లు మూతపడటంపై కూడా బాబు స్పందించారు. అన్నక్యాంటీన్ల మూసివేతవల్ల పేదలు ఆకలితీర్చుకోడానికి అవస్థలు పడుతుంటే, 20 వేలమంది క్యాంటీన్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోయారు. వీళ్ళేకాదు ప్రభుత్వ అనాలోచిత చర్యలవల్ల చిరుద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ అండగా నిలిచి అందరికీ న్యాయం జరిగే వరకూ పోరాడుతాం అని బాబు ట్వీట్ చేశారు.