వివేకా హత్య కేసుపై బాబు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న బాబు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏడు నెలలుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని బాబు విమర్శించారు. […]

వివేకా హత్య కేసుపై బాబు సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Dec 04, 2019 | 8:52 PM

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న బాబు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు.

ఏడు నెలలుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని బాబు విమర్శించారు. వైసీపీ నేతలకు కండకావరం పెరిగిందని మండిపడ్డారు. కమీషన్ కోసమే లిక్కర్ ధరలు పెంచారన్న ఆయన.. ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్‌ను దిగుమతి చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తోందని, ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని బాబు కామెంట్లు చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో జారీ చేసిన చంద్రబాబు.. ఆ మధ్యన కోడెల మృతిపై, ఇప్పుడు వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరడం గమనించదగ్గ విషయం.

వివేకా హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్సీకి నోటీసులు వివేకా హత్య కేసులో సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇకపై రోజువారీ విచారణను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న సిట్.. తాజాగా వివేకా డ్రైవర్లు ప్రకాష్, దస్తగిరిని విచారించారు. మరోవైపు విచారణకు హాజరుకావాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం బీటెక్ రవి, సిట్ విచారణకు హాజరుకానున్నారు. అలాగే వివేకా కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కూడా సిట్ బృందం విచారించే అవకాశం ఉంది.