Breaking News
 • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
 • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
 • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
 • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
 • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
 • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

“చిన్నవాడైనా జగన్‌కు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా”

CM Chandrababu Naidu On Capital Shifting, “చిన్నవాడైనా జగన్‌కు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా”

టీడీపీ ఎమ్మెల్యేలను ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ..ఆయన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని అంశం కంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు స్పీచ్‌లోని ముఖ్యాంశాలు :

 • ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా సిద్దాంతం
 • అందరూ నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
 • వారు మాట్లాడిన ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు
 • ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో ఎక్కడ మూడు రాజధానుల ప్రస్తావన లేదు
 • శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదు
 • శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పింది
 • శివరామకృష్ణన్ కమిటీ 46 శాతం అమరావతిపైనే మొగ్గు చూపింది
 • అమరావతిని వరద ముప్పు ప్రాంతంగా పరిగణించలేమని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది
 • అమరావతి రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు
 • బంగారు గుడ్డు పెట్టే బాతులా అమరావతి మారుతుంది
 • మోదీ, కేసీఆర్ అమరావతిపై ప్రశంసలు కురిపించారు
 • వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులే నేను పూర్తి చేశారు
 • అమరావతికి ఇప్పటికి 130 సంస్థలు వచ్చాయి
 • విశాఖ అంటే నాకు ఎంతో ప్రేమ
 • ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సంస్థలు, కంపెనీలు హైదరాబాద్ తరలిపోతున్నాయి
 • తక్కువ వడ్డీతో 2 వేలు కోట్లు అప్పు పుట్టింది అంటే అది అమరావతి బలం
 • హుద్‌హుద్‌ వచ్చినప్పుడు ఎవరెంత చేశారో విశాఖ వాసులకు తెలుసు
 •  హుద్‌హుద్‌ వచ్చినప్పుడు జగన్‌ కనీసం విశాఖ వాసులను పరామర్శించలేదు
 • విశాఖపై నాకు ఎంత ప్రేమ ఉందో…హుద్‌హుద్‌ సహాయ కార్యక్రమాలే చెబుతాయి
 • వైసీపీ చెప్పేవన్నీ బోగస్‌ కబుర్లు
 • ప్రపంచంలోని 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనుకున్నా
 • జగన్‌ పార్టీ వాళ్లకు భాష రాక, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు

Related Tags