పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు బంపర్ ఆఫర్

పార్టీ వీడతారన్న ప్రచారం నేపథ్యంలో పరిటాల ఫ్యామిలీకి పెద్ద పీట వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా మౌనం వహించిన పరిటాల ఫ్యామిలీ ఒక దశలో బిజెపిలో చేరతారన్న ప్రచారం జరిగింది. దాంతో వీరిని ఎలా డీల్ చేయాలన్న అంశంపై చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపినట్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఇటీవల పరిటాల సునీత, శ్రీరామ్‌లను చంద్రబాబు అమరావతికి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా తాము […]

పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు బంపర్ ఆఫర్
Follow us

|

Updated on: Dec 18, 2019 | 1:40 PM

పార్టీ వీడతారన్న ప్రచారం నేపథ్యంలో పరిటాల ఫ్యామిలీకి పెద్ద పీట వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా మౌనం వహించిన పరిటాల ఫ్యామిలీ ఒక దశలో బిజెపిలో చేరతారన్న ప్రచారం జరిగింది. దాంతో వీరిని ఎలా డీల్ చేయాలన్న అంశంపై చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే, ఇటీవల పరిటాల సునీత, శ్రీరామ్‌లను చంద్రబాబు అమరావతికి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా తాము పార్టీ వీడతామన్న ప్రచారంలో నిజం లేదని పరిటాల సునీత చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు, తన తనయుడు శ్రీరామ్‌కు రాప్తాడు, ధర్మవరం సీట్లను ఇవ్వాలని సునీత చంద్రబాబును కోరారు. కానీ చంద్రబాబు రకరకాల ఈక్వేషన్ల కారణంగా రాప్తాడును మాత్రమే ఆఫర్ చేసి, ఎవరు పోటీ చేయాలనే అంశాన్ని పరిటాల ఫ్యామిలీకి వదిలేశారు. దాంతో తనయుని కోసం సునీత పోటీకి దూరమయ్యారు. కాకపోతే శ్రీరామ్ విజయం సాధించలేకపోయారు.

దాంతో పరిటాల ఫ్యామిలీ ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంటైంది. ఈ నేపథ్యంలో వారు పార్టీ వీడుతున్నారన్న ప్రచారం మొదలైంది. అసలే పార్టీ కష్టకాలంలో వుంది. ఇలాంటి పరిస్థితిలో పరిటాల ఫ్యామిలీ కూడా పార్టీకి దూరమైతే మరింత కష్టమని భావించిన చంద్రబాబు సుదీర్ఘ సమాచాలోచనల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్‌కు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని టిడిపి వర్గాల్లో పెద్ద టాక్ నడుస్తోంది.

నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కోసం ఓ యువజన నేతల కోటరీని చంద్రబాబు సిద్దం చేశారన్న ప్రచారం జరిగింది. ఈ యువ కోటరీలో చింతకాయల అయ్యన్న పాత్రుని తనయుడు విజయ్, పరిటాల సునీత తనయుడు శ్రీరామ్, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తదితరులున్నారంటూ పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి. తాజాగా వీరిలో ఒక్క రామ్మోహన్ నాయుడు ఒక్కరే యాక్టివ్‌గా వున్నారు. వరుసగా మూడో సారి ఎంపీగా విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో టిడిపి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

చింతకాలయ విజయ్, పరిటాల శ్రీరామ్‌లిద్దరు కాస్త సైలెంట్‌గానే వున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. నిజానికి పరిటాల సునీతనే రాప్తాడు నుంచి పోటీ చేయాల్సి వుండగా.. రెండు టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించడంతో తనయుని కోసం రాప్తాడును వదులుకున్నారు సునీత. ధర్మవరం సీటును శ్రీరామ్ కోసం ట్రైచేశారు సునీత. తాజాగా వీరిద్దరు పార్టీని వీడకుండా వుండేందుకు పరిటాల శ్రీరామ్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవినివ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో రాప్తాడుతోపాటు ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను పరిటాల ఫ్యామిలీకి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??