Chandrababu fires: ఏపీలో పోలీస్ టెర్రరిజమ్… రెచ్చిపోయిన బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ పోలీసుల వైఖరిపై రెచ్చిపోయారు. ఏపీలో పోలీస్ టెర్రరిజం యధేచ్ఛగా కొనసాగుతోందంటూ నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలీసులే టెర్రరైజ్ చేసే పరిస్ధితి ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారయన.

Chandrababu fires: ఏపీలో పోలీస్ టెర్రరిజమ్... రెచ్చిపోయిన బాబు
Follow us

|

Updated on: Mar 14, 2020 | 5:57 PM

Chandrababu fires on Andhra police: ఏపీలో పోలీస్ టెర్రరిజం యధేచ్ఛగా కొనసాగుతోందంటూ నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలీసులే టెర్రరైజ్ చేసే పరిస్ధితి ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారయన. నల్ల జీవోని అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్యంపైనే దాడికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు ఏపీ పోలీసులపై. పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు.

ఏపీలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు తీవ్రవాదాన్ని ఒక వ్యవస్థ గా మార్చేశారని, దీంతో కొందరు మంచి చేసే పోలీసులు ఉన్నా వారిని పనిచేయకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసు హింసను తట్టుకోలేక చాలా మంది లొంగిపోయే పరిస్థితి తలెత్తుతోందని, పోలీసు దాడుల వల్ల ఇబ్బందులు అంటూ చంద్రబాబు కొన్ని వీడియోలను ప్రదర్శించారు.

మహిళల్ని కొడుతున్న పోలీసులు తిరిగి వారిపైనే బైండోవర్ కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. ఎన్నికల్లో నిలబడటమే వారు చేసిన తప్పా? అని నిలదీసిన చంద్రబాబు.. ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ కార్యకర్తలను హింసించారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్న వారిపై పోలీసులు టెర్రరిజం చూపించారని, ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితిని పోలీసులు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందో డీజీపీ చెప్పాలని, నియంతలను కాపాడటానికి పోలీసులు టెర్రరిజాన్ని ఎంచుకున్నారా? అని ప్రశ్నించారు బాబు. వివేకానంద హత్య వెనుక ఉన్నది ఇంటి దొంగలే అన్న సంగతి ప్రపంచమంతా తెలుసని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ప్రజల మాన ప్రాణ పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అవకాశ వాదులు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న చంద్రబాబు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఒత్తిళ్ళకు లోను కాకుండా నిర్భయంగా తమ అభిమతానికి అనుగుణంగా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.