జగన్ కుట్రలో భాగమే చంద్రగిరి రీపోలింగ్ : దేవినేని

Devineni Uma, జగన్ కుట్రలో భాగమే చంద్రగిరి రీపోలింగ్ : దేవినేని

చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్ జగన్ కుట్రలో భాగమేనని ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. పోలింగ్ జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశిస్తారా.. అంటూ ఈసీని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు జగన్‌తోపాటు ప్రశాంత్ కిషోర్, విజయసాయిరెడ్డి కలిసి అనేక కుట్రలు చేశారని విమర్శించారు దేవినేని. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని.. కాబోయే ప్రధానిని చంద్రబాబే నిర్ణయిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని జగన్‌ కోట్లు ఖర్చు పెట్టారని.. ఆయన కుట్రలకు అడ్డులేకుండా పోతోందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని… ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని.. అయితే పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్‌లైన్‌‌లో ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *