‘‘చంద్రబాబుకు వయసైపోయింది… ఆయన్ను రిటైర్ చేసి ఇంట్లో కూర్చోబెట్టండి… మంత్రి పేర్ని నాని సలహా..

అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో వ్యవహరించిన తీరును మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు.

  • Rajeev Rayala
  • Publish Date - 8:47 pm, Mon, 30 November 20
‘‘చంద్రబాబుకు వయసైపోయింది... ఆయన్ను రిటైర్ చేసి ఇంట్లో కూర్చోబెట్టండి... మంత్రి పేర్ని నాని సలహా..

అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో వ్యవహరించిన తీరును మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబును ఉద్దేశిస్తూ… ‘‘తాటి చెట్టుకు వయసు వచ్చింది. చంద్రబాబుకు వసు వచ్చింది. ఆయన్ను రిటైర్ చేసి ఇంట్లో కూర్చోబెట్టాలని వారి కుటుంబ సభ్యులకు సలహా ఇస్తున్న’’ అని మంత్రి నాని హాట్ కామెంట్స్ చేశారు. కెమెరా లేనిదే చంద్రబాబు బ్రతకలేని పరిస్థితి అని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ వాడు,వీడు అని మాట్లాడుతున్నారు, మరి ఆయన్ని మేము ఏరా అనడం ఎంత సేపు పని అని మంత్రి అన్నారు.

రైతుల గుండెల్లో బుల్లెట్లు దించింది ఎవరు…

రైతుల గుండెల్లో బుల్లెట్లు దింపిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతులను మోసం చేసిన దగాకోరు బాబు అని దుయ్యబట్టారు. ఆయన తన ఐదేళ్ల పాలనను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పటి బకాయిలు చెల్లించను అని గతంలో చంద్రబాబు చెప్పారు. కానీ మా ప్రభుత్వం ఆయన చేసిన అప్పులను మేము చెల్లిస్తున్నామని తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడుతున్న బాబుకు ఆయన తండ్రి ఖాజ్జూర నాయుడు రాజ్యం కావాలా అని విమర్శించారు. అసెంబ్లీ అంటే టీడీపీ సమావేశాలు కాదని బాబు గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. రైతుల విషయంలో నెలలోపు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తాం అని సీఎం చెప్పారని తెలిపారు. మైనారిటీ ఎమ్మెల్యేను దుర్భాషలాడిన కుసంస్కారి బాబు అని అన్నారు.