లాక్ డౌన్ ఉల్లంఘనులను ఆ ‘పోలీస్ గాలం’ ఎలా పట్టేస్తుందంటే ?

లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని పట్టుకునేందుకు, అదే సమయంలో సామాజిక దూరాన్ని పాటించేందుకు చండీ గడ్ పోలీసులు ఓ  వినూత్నమైన, వెరైటీ మార్గాన్ని కనుగొన్నారు. వాళ్ళు అయిదు అడుగుల పొడవైన మెటల్ రాడ్ కి గాలం వంటి స్ట్రక్చర్ ని అమర్చారు.

లాక్ డౌన్ ఉల్లంఘనులను ఆ 'పోలీస్ గాలం' ఎలా పట్టేస్తుందంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2020 | 1:37 PM

లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని పట్టుకునేందుకు, అదే సమయంలో సామాజిక దూరాన్ని పాటించేందుకు చండీ గడ్ పోలీసులు ఓ  వినూత్నమైన, వెరైటీ మార్గాన్ని కనుగొన్నారు. వాళ్ళు అయిదు అడుగుల పొడవైన మెటల్ రాడ్ కి గాలం వంటి స్ట్రక్చర్ ని అమర్చారు. ఇది లాక్ డౌన్ వయోలెటర్ల నడుమును పట్టుకునేలా ఉంటుంది. వారిని పోలీసులు పట్టుకోకుండానే ఈ ‘గాలాన్ని’ ఉపయోగించి తమ వాహనంలోకి ఎక్కించగలుగుతారు. ఈ సాధనం నుంచి వయొలెటర్లు తప్పించుకునే అవకాశమే ఉండదు. చండీగఢ్ డీజీపీ సంజయ్ బనీవాల్ ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. పోలీసు విభాగంలోని వీఐపీ సెక్యూరిటీ వింగ్ ఈ అసాధారణ సాధనాన్ని రూపొందించిందని అన్నారు. కరోనా అనుమానితులను, కర్ఫ్యూ ఉల్లంఘనకారులను, పోలీసులకు సహకరించని వారిని ఈ సాధనం వల్ల సులభంగా పట్టుకోగలుతామని ఆయన పేర్కొన్నారు.