ఈ మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..

ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరికలు జారీ చేశారు. మూడు జిల్లా పరిసర ప్రాంతాల్లో పిడుగులు..

ఈ మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..
Follow us

|

Updated on: Sep 07, 2020 | 4:32 PM

Thunderstorm Warning : ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరికలు జారీ చేశారు. మూడు జిల్లా పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. సాధ్యమైనంత వరకు జనాలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది. వీరంతా ముందస్తుగానే సురక్షితమైనభవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపారు. తమిళనాడు కోస్తా తీరం వెంబడి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడింది. దీంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో మూడు రోజుల పాటు ఏపీలో వాతావరణ ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.