Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

రొటీన్ ఫార్ములా.. ‘చాణక్య’ మూవీ రివ్యూ

Chanakya Telugu Movie Review, రొటీన్ ఫార్ములా.. ‘చాణక్య’ మూవీ రివ్యూ

టైటిల్ : ‘చాణక్య’

తారాగణం : గోపీచంద్, మెహ్రీన్, సునీల్,అలీ, జరీన్ ఖాన్, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు తదితరులు

సంగీతం : విశాల్ చంద్ర శేఖర్

నిర్మాతలు : రామ బ్రహ్మం సుంకర

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తిరు

విడుదల తేదీ: 05-10-2019

గోపీచంద్, మెహ్రీన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన చిత్రం ‘చాణక్య’. స్పై థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ‘సైరా’ సినిమాకు ధీటుగా విడుదలైన ఈ మూవీపై జనాల్లో ఆసక్తి నెలకొంది. మరి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

అంతర్జాతీయ ఉగ్రవాదైన ఖురేషి(రాజేష్ ఖట్టర్)ను పాకిస్థాన్ నుంచి ఇండియా రప్పించడానికి ‘రా’ విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక ఈ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా డేర్ డెవిల్ ఆఫీసర్ అర్జున్(గోపీచంద్)ను పాకిస్తాన్‌కు పంపిస్తుంది.? అర్జున్ పాకిస్థాన్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు.? ఖురేషిని అర్జున్ పట్టుకోగలిగాడా.? ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో అర్జున్ సక్సెస్ సాధించాడా.? మెహ్రీన్, జరీన్ ఖాన్‌లు.. అర్జున్ జీవితంలోకి ఎలా వచ్చారనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.?

న‌టీన‌టుల అభినయం:

అండర్ కవర్ రా ఏజెంట్ పాత్రలో గోపీచంద్ తొలిసారి నటించినా.. ఎప్పటిలానే తన అద్భుతమైన నటనతో పూర్తిగా న్యాయం చేశారు. అటు ఎమోషనల్ సన్నివేశాలు, ఇటు యాక్షన్ సీన్స్‌లోనూ చక్కటి ఈజ్‌‌ను చూపించాడు. రా చీఫ్‌గా నాజర్ సరిగ్గా సరిపోయారు. సినిమా మొదటిభాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎంతో ఎంగేజింగ్‌గా ఉన్నాయి.

హీరోయిన్ల విషయానికి వస్తే.. మెహ్రీన్, జరీన్ ఖాన్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. మెహ్రీన్ పాత్ర రొటీన్ గా ఉన్నా.. జరీన్ మాత్రం సీక్రెట్ ఏజెంట్‌గా చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఇక బాలీవుడ్ నటుడు ఉపెన్ పటేల్ స్టైలిష్ విలన్‌గా అదరగొట్టారు. ముఖ్యంగా అతడికి, హీరోకి మధ్య కరాచీ బేస్డ్‌లో జరిగిన ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇకపోతే ప్రీ-క్లైమాక్స్ ప్రేక్షకుల్లో మంచి ఉత్కంఠ రేపింది.

విశ్లేష‌ణ‌ :

మొదటి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, అలీ కామెడీతో అంతా సజావుగా సాగింది. అయితే రెండో భాగంలోకి వచ్చేసరికి సినిమా పట్టు కోల్పోయి… వాస్తవానికి దూరంగా ఉండే సన్నివేశాలు, పోరాటాలు సినిమాకు మైనస్ పాయింట్లయ్యాయి. అంతేకాక గోపీచంద్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా లేకపోవడం ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ఏది ఏమైనా కొంత లాజిక్స్ మిస్సైన ఈ సినిమా ఫర్వాలేదనిపించేలా ఉంటుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా ఓకే. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • గోపీచంద్ నటన
  • ఫస్ట్ హాఫ్

మైనస్‌ పాయింట్స్‌ :

  • సెకండ్ హాఫ్, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు