‘ఛలో ఢిల్లీ’ పిలుపుపై హస్తినకు కదిలిన వేలాది రైతులు, గజగజ వణికించే చలిని లెక్కచేయకుండా !

రైతు చట్టాలకు వ్యతిరేకంగా,, పంజాబ్ సహా 5 రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు హర్యానా సరిహద్దులు దాటి ఢిల్లీ బాట పట్టారు. గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దుప్పట్లు, రేషన్   సరకులతో సహా మోడెర్న్ ట్రాక్టర్లపై ప్రయాణిస్తున్నారు.

'ఛలో ఢిల్లీ' పిలుపుపై హస్తినకు కదిలిన వేలాది రైతులు, గజగజ వణికించే చలిని లెక్కచేయకుండా !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2020 | 11:10 AM

రైతు చట్టాలకు వ్యతిరేకంగా,, పంజాబ్ సహా 5 రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు హర్యానా సరిహద్దులు దాటి ఢిల్లీ బాట పట్టారు. గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దుప్పట్లు, రేషన్   సరకులతో సహా మోడెర్న్ ట్రాక్టర్లపై ప్రయాణిస్తున్నారు. మరికొందరు కాలినడకనే  సాగుతున్నారు.రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించేంతవరకు ఆందోళన విరమించబోమని, వెనక్కి వెళ్లబోమని హెచ్ఛరిస్తున్నారు. 50 వేలమందికి పైగా అన్నదాతలు ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారని రైతు సంఘాలు వెల్లడించాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మారుమూల ప్రాంతాల నుంచి పిల్లలతో సహా  మహిళలు కూడా  ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.

గత  అర్ధరాత్రి సోనీపట్ లో అన్నదాతలను అడ్డగించిన పోలీసులు వారిపై వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అటు వీరి ఆందోళన నేపథ్యంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుధ్ధం ప్రారంభమైంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఆరోపించగా..పంజాబ్ నుంచి వందలాది అన్నదాతలను కావాలనే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టి పంపుతోందని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ దుయ్యబడుతున్నారు. కాగా స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ ను హర్యానా పోలీసులు అరెస్టు చేయగా, సామాజికవేత్త మేధా పాట్కర్ ను యూపీ పోలీసులు రాజస్థాన్ బోర్డర్ లో అడ్డగించి వెనక్కి పంపివేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా ఉందని, పక్క రాష్ట్రాల నుంచి నిరసనకారులు ఎవరు వఛ్చినా  అరెస్టులు చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని వారు తమ ట్విటర్లో పేర్కొన్నారు.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.