ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్.. వీడియో చూడండి

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పట్టపగలే చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందేర్‌పూరి ప్రాంతంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే బైక్ పై నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించారు. అనంతరం ఓ వ్యక్తి బైక్ దిగి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరాణాలను బలవంతంగా లాక్కెళ్లాడు. దుండగుడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ విపరీతంగా ప్రయత్నించిన సమయంలో ఆమె కింద పడిపోయింది. అయినప్పటికీ ఆ దుండగుడు ఆమె మెడలోని గోలుసును లాక్కెళ్లి బైక్‌పై ఎక్కి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *