విశాఖలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్

విశాఖపట్నం జిల్లా నడుపూర్‌లో చైన్‌స్నాచర్ రెచ్చిపోయాడు. ఓ మహిళ మెడలోంచి చైన్‌ను దొంగలించాడు. ఈ క్రమంలో ప్రతిఘటించిన ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డారు. తర్వాత గోలుసును లాక్కుని వెళ్లారు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:50 pm, Mon, 19 October 20

విశాఖపట్నం జిల్లా నడుపూర్‌లో చైన్‌స్నాచర్ రెచ్చిపోయాడు. ఓ మహిళ మెడలోంచి చైన్‌ను దొంగలించాడు. ఈ క్రమంలో ప్రతిఘటించిన ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డారు. తర్వాత గోలుసును లాక్కుని వెళ్లారు. బాధిత మహిళ సత్యవతికి మణికట్టుతో పాటు ముఖంపై తీవ్ర గాయమైంది. చేయి తెగిపోవడంతో స్పానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఓ షాపు నిర్వహిస్తున్న సత్యవతి ఒంటరిగా ఉండడాన్ని చూసే ఆ దొంగ రెక్కి నిర్వహించి మరీ దాడికి తెగబడినట్టుగా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో నిందితులు వదిలివెళ్లిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను గమనిస్తున్నారు. పాన్ షాపు నిర్వహిస్తున్న సత్యవతిని టార్గెట్ చేయడం కలకలం రేపింది. నాలుగుచోట్ల మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.