ఈ ఉదయం చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్- 2

చంద్రయాన్- 2 ఇవాళ మరికాసేపట్లో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగంలో ఇది అత్యంత కీలకం. మంగళవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్- 2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. సెప్టెంబర్ 2న ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోనుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి ప్రవేశపెడతారు. ఇప్పటివరకు శాటిలైట్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ శివన్ […]

ఈ ఉదయం చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్- 2
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 5:48 AM

చంద్రయాన్- 2 ఇవాళ మరికాసేపట్లో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగంలో ఇది అత్యంత కీలకం. మంగళవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్- 2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. సెప్టెంబర్ 2న ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోనుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి ప్రవేశపెడతారు. ఇప్పటివరకు శాటిలైట్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రుని కక్ష్యలోకి వెళ్లడం అత్యంత సవాల్‌‌తో కూడుకున్న విషయమని ఆయన తెలిపారు. గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్- 2 దిగ్విజయంగా దూసుకుపోతుంది.