గంభీర్‌ విజయ దుందుభి

Gambhir Set for Second Innings on Political Turf, గంభీర్‌ విజయ దుందుభి

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తొలి ఎన్నికల్లోనే తన సత్తా చాటాడు. రాజకీయ మైదానంలో  ఎంట్రీ ఇచ్చిన తొలిసారే అద్భుత శతకం బాదేశాడు. తూర్పు ఢిల్లీలో తన సమీప కాంగ్రెస్‌  అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించాడు. గౌతీ 6,95,109 ఓట్లు సాధించాడు. అంటే 55.35 శాతం ఓట్లన్నమాట. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీకి 3,04,718 ఓట్లు లభించాయి. ఆమ్‌ఆద్మీ నేత ఆతిశీ మెర్లీన్‌ 2,19,156 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గంభీర్‌ 3,90,391 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *