Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షలు రద్దు. సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ . ఫెయిల్ అయిన విద్యార్థులంతా పాస్ అయినట్లు పాటించిన ఇంటర్ బోర్డు . కంపార్ట్మెంట్ లో పాస్ అయినట్లుగా సర్టిఫికెట్ లో పేర్కొననున్న బోర్డు . 1.47 లక్షల మంది విద్యార్థులకి ప్రయోజనం. రి కౌంటింగ్ , రి వెరిఫికేషన్ ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు . - సబితా ఇంద్రారెడ్డి
  • తిరుమల కంటైన్మెంట్ జోన్ వార్తలపై చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా క్లారిటీ. తిరుమలలో ఎలాంటి రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్ లేదు: కలెక్టర్. కేవలం ఒక ప్రాంతంలో ఉన్న పోలీస్ బెటాలియన్‌లో.. పోలీసులకు మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది: కలెక్టర్ . నారాయణ భరత్ గుప్తా. సిబ్బంది చిన్న పొరపాటుతో కంటైన్మెంట్ క్లస్టర్‌గా తిరుమల పేరు వచ్చింది. తెలియక చేసిన తప్పుకాబట్టి సిబ్బందిపై చర్యలు తీసుకోం: కలెక్టర్. తిరుమలలో ప్రస్తుతానికి అద్భుతంగా దర్శనాలు జరుగుతున్నాయి: కలెక్టర్. సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించి భక్తులు సహకరిస్తున్నారు: కలెక్టర్. కరోనా కేసులు పెరిగితే టీటీడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వంతో... చర్చించి ఆలయాన్నీ మూసివేసి అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాము. తిరుమల కొండపై మొత్తం 89మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. భక్తులెవరికీ కరోనా పాజిటివ్ రాలేదు.
  • విజయవాడ: వలస కార్మికులను తరలించినందుకు ఆర్టీసీకి 15.71 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు,బకాయిలు చెల్లించిన ఆర్టీసీ . విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ ఆర్ బీఎస్ పెన్షన్ ,ఎస్ బిటీ చెల్లించిన ఆర్టీసీ. ఐటీఐ అప్రెంటీస్ లకు స్టైపండ్,ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ , డీజిల్ ఖర్చులు చెల్లింపు.
  • రేపటి నుండి గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే షాపులు తీసి ఉంచాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం. కంటైన్ మెంట్ జోన్లలో షాపులు తీయకూడదని నిర్ణయం. గత మూడు రోజుల నుండి నూట యాభైకి పైగా పాజిటివ్ కేసులు నమోదు. గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు. అవసరం లేకుండా రోడ్లపైకి రావద్థని అధికారుల విజ్ఞప్తి.
  • తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన: దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సంచాలకులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • డిపాజిట్ల పేరుతో నిండా ముంచిన బెర్షెబా కంపెనీ . తక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే అందుకు మూడింతలు నెలనెలా చెల్లిస్తామని దగా. కామారెడ్డి జిల్లా కేంద్రంగా బెర్షెబా కంపెనీ మోసం . తక్కువ డబ్బు చెల్లిస్తే ఎక్కువ వస్తాయనే ఆశతో వేలాదిమంది ఆ కంపెనీలో డబ్బు జమ. ఓ యువతి పిర్యాదు తో రంగంలోకి దిగిన పోలిసులు. విచారణ చెపట్టి బెర్షెబా కంపెనీ యజమాని ఇస్మాయిల్ ను అరెస్టు . గతంలో ఇస్మాయిల్ పోలిసులకు కు సవాల్‌ . ఇస్మాయిల్ తో పాటు మరో 15మంది ఏజెంట్ల పై కెసు నమోదు.

ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విలువ 2 లక్షల కోట్లు

centre's good news to andhrapradesh, ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విలువ 2 లక్షల కోట్లు

విభజన తర్వాత ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం ప్రకటించిందే నిజమైతే ఏపీకి త్వరలో 2 లక్షల కోట్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఏపీ దశ, దిశ మారిపోతుందని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని కేంద్రం ఏపీ సర్కార్‌కు నేరుగా తెలియజేసింది.

ఏపీకి విస్తారంగా వున్న సముద్ర తీరం, అపారంగా వున్న సహజ వాయు నిక్షేపాలే ఏపీ దశ దిశను భవిష్యత్తులో మార్చేస్తాయని తెలిపారు కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, స్టీల్ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈ మాటలు ఎక్కడో కాదు.. శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసిన సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాలమైన సముద్ర తీరం.. అందులోని అపార నిక్షేపాలు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దశ, దిశను మార్చేస్తాయన్నది ప్రధాన్ అభిప్రాయం.

centre's good news to andhrapradesh, ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విలువ 2 లక్షల కోట్లుఏపీలో ప్రవహించే కృష్ణా-గోదావరి నదుల బేసిన్‌లో అపార చమురు గ్యాస్ నిక్షేపాలున్నట్టు ఇప్పటికే ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు తాము నిర్వహించిన సర్వే రిపోర్టుల్లో తేల్చాయి. వాటి వెలికితీతకు ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఇంకా ఎంతో అపార నిల్వలు ఉన్న ఏపీకి ఇప్పుడు ఉజ్వల భవిష్యత్ ఉందని అంటున్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఏపీ పర్యటనకొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ ఏపీ సీఎం జగన్‌ని కలిశారు. ఈ సందర్భంలో ఏపీకి భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు వస్తాయని తెలిపినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్రోలియం సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. కృష్ణా-గోదావరి బేసిన్ లోని అపార చమురు గ్యాస్ నిక్షేపాలతో ఏపీకి పెట్టుబడుల తరలి వస్తాయని, ఇప్పటికే ఈ గ్యాస్ వెలికి తీయడానికి విదేశీ పెట్రోలియం సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ధర్మేంద్ర చెప్పుకొచ్చారు.

కడపలోని ఇనుము ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను ఎన్ఎండీసీ నుంచి సరఫరా చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ అభ్యర్థనకు స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎండీసీ దీనిపై ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు.

Related Tags