కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్ళదు: అమిత్‌షా

Centre will not touch Article 371: Amit Shah, కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్ళదు: అమిత్‌షా

ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని అంశాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించే 371 అధికరణను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. గువహటిలో ఆదివారం జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి 68వ ప్లీనరీ సమావేశానికి హాజరైన ఆయన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈశాన్య రాష్ట్రాల వంతు రాబోతోందంటూ ఊహాగానాలు వచ్చాయి.

బీజేపీ ప్రభుత్వం 371 అధికరణను గౌరవిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిలో మార్చులు చేయమని చెప్పారు. ఆర్టికల్ 370 స్వభావరీత్యా తాత్కాలికమైనదని, 371 అనేది ప్రత్యేక ప్రొవిజన్ అని ఆయన అన్నారు. ‘371 అధికరణను రద్దు చేయమని పార్లమెంటులో కూడా చెప్పాను. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఖ్యమంత్రుల సమక్షంలో ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. ఆ అధికరణ జోలికి వెళ్లం’ అని అమిత్‌షా అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *