ఉల్లిపై కేంద్రం గుడ్ న్యూస్..!!.. హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు..

ఉల్లి రైతులకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కేపీ (కృష్ణాపురం) ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 10 వేల మెట్రిక్ టన్నుల కేపీ ఉల్లిని చెన్నై పోర్టు నుంచి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఉల్లి పరిమాణంపై కడప హార్టికల్చర్ అధికారి సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31లోగా ఈ ఎగుమతులను పూర్తి చెయ్యాలని ఆదేశాల్లో […]

ఉల్లిపై కేంద్రం గుడ్ న్యూస్..!!.. హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు..
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 12:49 PM

ఉల్లి రైతులకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కేపీ (కృష్ణాపురం) ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 10 వేల మెట్రిక్ టన్నుల కేపీ ఉల్లిని చెన్నై పోర్టు నుంచి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఉల్లి పరిమాణంపై కడప హార్టికల్చర్ అధికారి సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31లోగా ఈ ఎగుమతులను పూర్తి చెయ్యాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా.. కేపీ ఉల్లి రైతులకు న్యాయం చేయాలని పార్లమెంట్‌లో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో.. ఈ కృష్ణాపురం రకం ఉల్లిపాయలను.. దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నారని తెలిపారు. హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాలు.. ఈ కేపీ ఉల్లిని దిగుమతి చేసుకుంటాయని.. అయితే గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ కేపీ రకం ఉల్లితో సహా.. అన్ని రకాల ఉల్లిపాయలను విదేశాలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించిందని.. ఈ క్రమంలో కేపీ ఉల్లిపై నిషేధం ప్రభావం పడిందని పేర్కొన్నారు.

విదేశాలకు ఎగుమతులను ప్రభుత్వం నిషేధించడం వల్ల.. కేపీ ఉల్లి సాగుచేస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. ఈ రకం ఉల్లిని దేశీయ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేపీ ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కూడా పనికి రాదన్నారు. దీంతో చేతికొచ్చిన పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎగుమతులపై నిషేధం కొనసాగితే.. కేపీ ఉల్లి పండించే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని.. రోజ్‌ ఆనియన్‌ పేరుతో ఇదే రకం ఉల్లిని కర్ణాటక రైతులు సాగుచేస్తున్నారని.. అయితే ఆ రోజ్ ఉల్లిని ఎగుమతి చేయడానికి కేంద్రం అనుమతించిందని.. కాబట్టి.. తమ రాష్ట్రంలో పండించే కేపీ ఉల్లి ఎగుమతులకు కూడా అనుమతించాలని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. దీంతో స్పందించిన మంత్రి.. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేపీ ఉల్లి ఎగుమతికి గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన ఈ ప్రకటనపై.. రైతులు హర్షం వ్యక్తం చేశారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ ప్రకటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.