యోగీని గోరఖ్‌పూర్‌ మఠానికి పంపించాలంటున్న మాయావతి

హథ్రాస్‌ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో అలాంటి సంఘటనే జరిగింది.. వరుస హత్యాచార ఘటనలపై దేశం యావత్తూ కదిలింది.. నిరసనలు తెలుపుతోంది.. పోలీసుల తీరుపై భగ్గుమంటోంది.. హథ్రాస్‌, బలరాంపూర్‌ ఘటనలపై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.. బీజేపీ నేతృత్వంలో నేరస్తులు, రేపిస్టులు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్యం కారణంగానే నేరాలు పెరుగుతున్నాయన్నారు. దళిత బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదని తెలిపారు మాయావతి.. తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల […]

యోగీని గోరఖ్‌పూర్‌ మఠానికి పంపించాలంటున్న మాయావతి
Follow us

|

Updated on: Oct 01, 2020 | 2:29 PM

హథ్రాస్‌ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో అలాంటి సంఘటనే జరిగింది.. వరుస హత్యాచార ఘటనలపై దేశం యావత్తూ కదిలింది.. నిరసనలు తెలుపుతోంది.. పోలీసుల తీరుపై భగ్గుమంటోంది.. హథ్రాస్‌, బలరాంపూర్‌ ఘటనలపై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.. బీజేపీ నేతృత్వంలో నేరస్తులు, రేపిస్టులు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్యం కారణంగానే నేరాలు పెరుగుతున్నాయన్నారు. దళిత బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదని తెలిపారు మాయావతి.. తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, మహిళలకు రక్షణ కరువయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు మాయావతి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. కేంద్రం వెంటనే కల్పించుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని ఆయన స్వ‌స్థ‌ల‌మైన గోర‌ఖ్‌పూర్ మ‌ఠానికి పంపించాల‌న్నారు. పోలీసుల తీరును కూడా ఆమె తప్పుపట్టారు మామావతి.