జమ్ము కశ్మీర్ అభివృద్ధికి కదిలిన కేంద్రం… ఐదుగురు సభ్యులతో మంత్రుల బృందం

జమ్ము కశ్మీర్ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఐదుగురు మంత్రులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీఓఎం)ను కేంద్రం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడ్డ జమ్ము కశ్మీర్ అభివృద్ధి కోసం తీసుకుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించి ఓ రోడ్ మ్యాప్ తయారు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించనుందనే వార్తల నేపథ్యలో ప్రస్తుతం జీవోఎంకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ ఇటీవల దేశప్రజలనుద్దేశించే మాట్లాడారు. జమ్ము […]

జమ్ము కశ్మీర్ అభివృద్ధికి కదిలిన కేంద్రం... ఐదుగురు సభ్యులతో మంత్రుల బృందం
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 5:00 PM

జమ్ము కశ్మీర్ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఐదుగురు మంత్రులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీఓఎం)ను కేంద్రం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడ్డ జమ్ము కశ్మీర్ అభివృద్ధి కోసం తీసుకుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించి ఓ రోడ్ మ్యాప్ తయారు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించనుందనే వార్తల నేపథ్యలో ప్రస్తుతం జీవోఎంకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ ఇటీవల దేశప్రజలనుద్దేశించే మాట్లాడారు. జమ్ము కశ్మీర్ యువతకు విద్యా ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఎవరికీ ఎటువంటి భయాలు అవసరం లేదని మోదీ భరోసా ఇచ్చారు. తాజాగా కేంద్రం ఐదుగురు సభ్యుల జీఓఎం ఏర్పాటు చేయడంతో.. జమ్ము కశ్మీర్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదుగురు మంత్రుల బృందంలో రవిశంకర్ ప్రసాద్, తవర్ చంద్ గెహ్లోత్, జితేందర్ సింగ్, నరేంద్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్ సభ్యులుగా ఉంటారు.