కరోనా వైరస్ నివారణ… హోం ఐసోలేషన్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే..కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు క్షేత్ర స్థాయిలో స్వీయ నియంత్రణపై  హోం శాఖ గైడ్ లైన్స్ ని రోగులు  కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ సందర్భంగా గత మే 10 న జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను సవరించింది. తక్కువ పాజిటివ్ లక్షణాలు..

కరోనా వైరస్ నివారణ... హోం ఐసోలేషన్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే..కేంద్రం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 12:16 PM

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు క్షేత్ర స్థాయిలో స్వీయ నియంత్రణపై  హోం శాఖ గైడ్ లైన్స్ ని రోగులు  కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ సందర్భంగా గత మే 10 న జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను సవరించింది. తక్కువ పాజిటివ్ లక్షణాలు గల రోగులు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లాలని, ఆ రోగికి తనకంటూ ఓ ప్రత్యేక గది, టాయిలెట్ సౌకర్యం, ఓ అటెండెంట్ లేదా సహాయకుడు ఉండాలని ఈ సరికొత్త సూత్రాల్లో సూచించారు. సంబంధిత రోగి తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు జిల్లా సర్వేలెన్స్ అధికారికి తెలియజేస్తూ ఉండాలని, పైగా అతడి ఆరోగ్యాన్ని  పరీక్షించే డాక్టర్ కూడా ఆ రోగి హెల్త్ పట్ల సంతృప్తికరంగా ఉండాలని, పేర్కొన్నారు. అంతే కాదు.. ఆ పేషంట్ రెసిడెన్షియల్ అకామడేషన్ పట్ల కూడా డాక్టర్ సంతృప్తి వ్యక్తం చేయాలట. స్వీయ నియంత్రణకు సంబంధించి ఒక రోగి తాను ఈ గైడ్ లైన్స్ ని కఛ్చితంగా పాటిస్తానని హామీ కూడా ఇవ్వాలని సూచించారు.

ఈ విధమైన కేసులను డాక్టర్ల బృందాలు రెగ్యులర్ గా పరీక్షిస్తుండాలని, డిశ్చార్జికి అవసరమైన మార్గదర్శక సూత్రాలకు అవి లోబడి ఉండాలని సిఫారసు చేశారు. అనేక రాష్ట్రాల్లో ఈ విధమైన ఐసోలేషన్ ని రోగులు రొటీన్ గా పాటిస్తున్నట్టు తెలిసిందని, సవరించిన గైడ్ లైన్స్ ని పాటించడంలేదని, అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై శ్రధ్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తన గైడ్ లైన్స్ లో మరీ మరీ సూచించింది.