పెరగనున్న కలర్‌ టీవీ ధరలు!

దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వస్తోన్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది.

పెరగనున్న కలర్‌ టీవీ ధరలు!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 7:45 AM

Colour TV prices:  దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వస్తోన్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కలర్‌ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కలర్‌ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు కలర్‌ టీవీలు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా., ఇకపై వాటి నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) విభాగం ప్రకటన చేసింది. ఇందులో భాగంగా 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని తెరలు కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్‌సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీజీఎఫ్‌టీ లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది.

Read This Story Also: రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు: సోము వీర్రాజు