ఉల్లి నిల్వలపై కేంద్రం ఆంక్షలు

ఉల్లి ధర భగ్గుమంటుండంతో కేంద్రం ఎంట్రీ ఇచ్చింది. వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టింది.  ఉల్లి నిల్వలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోల్‌సేల్‌ వ్యాపారులు 25 మెట్రిక్‌ టన్నుల వరకు,

ఉల్లి నిల్వలపై కేంద్రం ఆంక్షలు
Follow us

|

Updated on: Oct 23, 2020 | 10:49 PM

Buffer Stock Of Onion : ఉల్లి ధర భగ్గుమంటుండంతో కేంద్రం ఎంట్రీ ఇచ్చింది. వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టింది.  ఉల్లి నిల్వలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోల్‌సేల్‌ వ్యాపారులు 25 మెట్రిక్‌ టన్నుల వరకు, రిటైలర్‌ వ్యాపారులు 2 మెట్రిక్‌ టన్నుల వరకు మాత్రమే ఉల్లిని నిల్వ చేయాలని నిబంధనలు విధించింది.

ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ జారీ చేశారు. ఈ పరిమితి శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిందని, సంబంధిత ఉత్తర్వులను జారీ చేసినట్లు  లీనా నందన్ తెలిపారు.

బహిరంగ మార్కెట్‌లో కిలో వంద నుంచి రూ.150కిపైగా ఉన్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నట్లు లీనా వెల్లడించారు. ఉల్లి ధరల స్థిరీకరణ కోసం దేశంలోనే తొలిసారి ఒక లక్ష మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌ ఉంచామని చెప్పారు. మన దేశంలో ఉల్లి వినియోగం ఎక్కువని, ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడానికి నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితితిని ముందే ఊహించి పెద్ద ఎత్తున స్టాక్ చేశామని తెలిపారు.