అందుకోసమే రాజధాని మార్పు.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు

రాజధాని మార్పుకు బీజేపీకి సంబంధం లేదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ వెంట రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌తో పాటు పురందేశ్వరీ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి, హోంమంత్రి అనుమతితోనే అమరావతిని మారుస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తప్పుడు ప్రచారంచేస్తోందన్నారు. రాజధాని మార్పులో […]

అందుకోసమే రాజధాని మార్పు.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jan 23, 2020 | 1:37 PM

రాజధాని మార్పుకు బీజేపీకి సంబంధం లేదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ వెంట రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌తో పాటు పురందేశ్వరీ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి, హోంమంత్రి అనుమతితోనే అమరావతిని మారుస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తప్పుడు ప్రచారంచేస్తోందన్నారు. రాజధాని మార్పులో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్న పవన్.. వైసీపీ ప్రభుత్వం.. వారి భూదందా కోసమే రాజధానిని మారుస్తోందన్నారు. మూడు రాజధానుల అంశం తమ వద్దకు రాలేదని ఏపీ బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దియోధర్ కూడా స్పష్టం చేశారన్నారు. ఇక అయిదు కోట్ల మంది రైతుల శ్రేయస్సు కోసం.. ఫిబ్రవరి 2న బీజేపీ-జనసేన సంయుక్తంగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.