బ్రేకింగ్: ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్

ఏపీ , ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్‌లను నియమించింది. ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్, ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా సుశ్రి అనసూయను ఖరారు చేశారు. వీరిని గవర్నర్‌లుగా నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ న్యాయవాది అయిన విశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఒడిశా మాజీమంత్రిగా పని చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కొనసాగారు. గతంలో జనసంఘ్‌, జనతాపార్టీలో పనిచేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన హరిచందన్‌.. 1988లో జనతాపార్టీలో చేరారు. 1996లో తిరిగి బీజేపీలొ చేరారు. ఒడిశాలో సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా కొనసాగారు. బీజేపీ, బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. సీనియర్‌ నేతగా బీజేపీ పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. సంఘ్ కార్యకలాపాల్లోనూ కీలకంగా పని చేశారు. కాగా ఇన్నిరోజులు గవర్నర్‌గా ఉన్న నరసింహన్.. 2009లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఆనాటి యూపీఏ ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. అంతకుముందు ఆయన 2007 నుంచి చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *