వారొక్కరే ఆందోళన చేస్తున్నారు.. రైతు ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్..

పంజాబ్ రాష్ట్ర రైతులు మాత్రమే ఆందోళనలు చేపడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. అసోచామ్ సదస్సులో..

వారొక్కరే ఆందోళన చేస్తున్నారు.. రైతు ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 11:09 AM

పంజాబ్ రాష్ట్ర రైతులు మాత్రమే ఆందోళనలు చేపడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. అసోచామ్ సదస్సులో పాల్గొన్న ఆయన రైతుల ఆందోళనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి తోమర్ చెప్పారు. అయితే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక్క పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు ఈ చట్టానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. ‘ఇది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య. దీన్ని మినమాయింపుగా మాత్రమే చూడాలి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఈ చట్టాలు అమల్లోకి రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు’ అని మంత్రి తోమర్ చెపపుకొచ్చారు.

ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతులు ఆందోళనలు నేటితో 23 రోజుకు చేరింది. రోజులు గడుస్తున్నా కొద్ది రైతుల ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఢిల్లీలో ఆందోళనకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతులు పట్టుబడుతున్నారు. మరోవైపు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో పలు దఫాలు రైతులతో చర్చలు కూడా జరిపింది. ఇప్పటి వరకు జరిపిన చర్చలేవీ సఫలం కాలేదు.

Also read:

యూఎస్ లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కి తీవ్రమైన అలెర్జీ, బ్రిటన్ తరహాలోనే !

మాస్క్ ధ‌రించ‌ని వారిపై అధికారుల కొర‌ఢా.. ఒకే రోజు 12 వేల మందికి జ‌రిమానా.. రూ. 24 ల‌క్ష‌లు వ‌సూలు