పారా షట్లర్లపై కేంద్రం కనకవర్షం

బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి పారా షట్లర్లపై కేంద్ర ప్రభుత్వం కనక వర్షం కురిపించింది. బాసెల్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రతీ ఒక్కరికి కేంద్ర నగదు బహుమానం అందించింది. ఈ టోర్నీలో పతకాలు సాధించిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని సోమవారం కలిశారు. పురుషల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ప్రమోద్ భగత్‌కు, మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి మానసి జోషిలకు రిజుజు రూ.20 లక్షల […]

పారా షట్లర్లపై కేంద్రం కనకవర్షం
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 5:05 AM

బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి పారా షట్లర్లపై కేంద్ర ప్రభుత్వం కనక వర్షం కురిపించింది. బాసెల్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రతీ ఒక్కరికి కేంద్ర నగదు బహుమానం అందించింది. ఈ టోర్నీలో పతకాలు సాధించిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని సోమవారం కలిశారు. పురుషల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ప్రమోద్ భగత్‌కు, మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి మానసి జోషిలకు రిజుజు రూ.20 లక్షల నగదు బహుమానం అందించారు. ఇక రజతం సాధించిన వారికి రూ.14 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.10.50 లక్షలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. పారా బ్యాడ్మింటన్ షట్లర్లను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని.. ఈ ఆనందానికి అవధులు లేవని రిజుజు పేర్కొన్నారు. అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఈ షట్లర్లకు ఘన స్వాగతం లభించింది.