Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫైన్లపై కేంద్రం రివర్స్ గేర్!

Centre To Re Consider Higher Traffic Fines, వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫైన్లపై కేంద్రం రివర్స్ గేర్!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాహనదారులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలు ఖజానా నింపుకునేందుకే ఇలా భారీగా పెనాల్టీలను విధిస్తున్నారంటూ.. వాహనదారులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చేపడుతున్నారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం ఇప్పటికే అమలులోకి వచ్చింది. భారీ జరిమానాలతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇది ఇలా ఉండగా భారీ జరిమానాలు.. వాహనదారుల క్షేమం కోసమేనని పలు సందర్భాల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలను సవరించవచ్చని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారే ఫైన్‌లను కడుతున్నారని.. ఉల్లఘించనప్పుడు జరిమానా కట్టాల్సిన అవసరం ఎందుకుని గడ్కరీ ప్రశ్నించారు కూడా. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం కోసమే నూతన మోటారు వాహనాల చట్టం అమలులోకి తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రజలు చట్టానికి భయపడినప్పుడే.. రూల్స్‌ను అతిక్రమించరని గడ్కరీ వెల్లడించారు.

ఇలా ఎన్నిసార్లు మంత్రి భారీ జరిమానాలపై వివరణ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే వ్యతిరేకత లభించడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. జరిమానాలు తగ్గించడంపై కేంద్రం న్యాయ శాఖ సలహా కోరినట్లు సమాచారం. అటు కేంద్ర చట్టానికి భిన్నంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు తక్కువ ఫైన్లను విధించాలని నిర్ణయించాయి. రోడ్లు, రవాణా సదుపాయాలను మెరుగుపరిచిన తర్వాతే చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రానికి మద్దుతు తెలిపింది. నూతన మోటారు వాహనాల చట్టం అమలు… భారీ జరిమానాల వల్ల రాజధాని ట్రాఫిక్ మెరుగవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలు అధిక ఫైన్ల వల్ల ఇబ్బందులు పడుతుంటే.. వాటిని సవరిస్తామని రాజధాని ప్రజలకు ఆయన అభయం ఇచ్చారు.  కొందరు కేంద్ర నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అనూహ్యంగా మరికొందరి నుంచి మద్దతు లభించడం విశేషం.