600 అదనపు బంకర్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం

జమ్ముకశ్మీర్‌ : పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రమాదం ఎదురైనా కశ్మీర్ వాసులకు తగిన రక్షణ వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని ఫూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో అదనపు బంకర్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫూంచ్‌ జిల్లాలో 400, రాజౌరీ జిల్లాలో 200 బంకర్లు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిసింది. నెల రోజుల్లో 600 బంకర్లు నిర్మించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే జనవరి నెలలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ), […]

600 అదనపు బంకర్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:56 PM

జమ్ముకశ్మీర్‌ : పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రమాదం ఎదురైనా కశ్మీర్ వాసులకు తగిన రక్షణ వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని ఫూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో అదనపు బంకర్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫూంచ్‌ జిల్లాలో 400, రాజౌరీ జిల్లాలో 200 బంకర్లు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిసింది. నెల రోజుల్లో 600 బంకర్లు నిర్మించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే జనవరి నెలలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంట పలు గ్రామాల్లో 14వేలకు పైగా బంకర్లను నిర్మించడానికి నిర్ణయించింది. వీటి నిర్మాణానికిగాను రూ.415.73కోట్లను విడుదల చేసింది. కశ్మీర్‌కు చెందిన పూంఛ్, రాజౌరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి 7,298 బంకర్లను.. జమ్ము, కథువా, సాంబా జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట 7,162 బంకర్లను నిర్మించనున్నారు. ఎల్‌వోసీ, ఐబీ వెంట మొత్తం 14460 వ్యక్తిగత, సామాజిక బంకర్లను ప్రభుత్వం నిర్మించతలపెట్టింది. వీటిలో 13,029 వ్యక్తిగత, 1431 సామాజిక బంకర్లున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సరిహద్దు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.