రూ.300 కోట్ల వరకు ఆయుధాల కొనుగోళ్లకు ఆర్మీకి స్వేచ్ఛ: రాజ్‌నాథ్‌

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా రూ.300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసుకొనే అధికారాన్ని సైన్యానికి ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

రూ.300 కోట్ల వరకు ఆయుధాల కొనుగోళ్లకు ఆర్మీకి స్వేచ్ఛ: రాజ్‌నాథ్‌
Follow us

|

Updated on: Jul 15, 2020 | 10:15 PM

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా రూ.300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసుకొనే అధికారాన్ని సైన్యానికి ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కీలక సమయాల్లో పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కేంద్రం భావిస్తోంది.

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బుధవారం రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా లద్దాఖ్‌ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై సమీక్షించింది. అలాగే అత్యాధునిక ఆయుధాల సమకూర్చుకునే విధానంపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే , ఇకపై అత్యవసర పనుల నిర్వహణ కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకొనే ప్రత్యేక అధికారాన్ని సైన్యానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. రూ.300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని తెలిపింది. భారత సైన్యాన్ని మరింత పటిష్ఠ పర్చాల్సిన అవసరముందని మండలి పేర్కొంది. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.