తెలుగు రాష్ట్రాల్లో 200 ట్రస్ట్‌లు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 ఎన్జీవోలను విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 సెక్షన్ 14 కింద రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపోతే ఈ బ్యాన్ చేసిన ట్రస్ట్‌లు తెలంగాణలో 90 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 168 ఉన్నాయి. అంతేకాకుండా వీటిల్లో 90 శాతం ఎన్జీవోలను క్రిస్టియన్ మతస్థులు చేపడుతున్నవి కావడం విశేషం. ఇందులో వైఎస్ విజయమ్మ పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ కూడా ఉండటం గమనార్హం. విదేశాల నుంచి విరాళాలు పొందుతూ.. సేవలు చేస్తూనే.. కొన్ని సంస్థలు […]

తెలుగు రాష్ట్రాల్లో 200 ట్రస్ట్‌లు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం!
Follow us

|

Updated on: Nov 17, 2019 | 9:29 PM

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 ఎన్జీవోలను విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 సెక్షన్ 14 కింద రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపోతే ఈ బ్యాన్ చేసిన ట్రస్ట్‌లు తెలంగాణలో 90 ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 168 ఉన్నాయి. అంతేకాకుండా వీటిల్లో 90 శాతం ఎన్జీవోలను క్రిస్టియన్ మతస్థులు చేపడుతున్నవి కావడం విశేషం. ఇందులో వైఎస్ విజయమ్మ పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ కూడా ఉండటం గమనార్హం.

విదేశాల నుంచి విరాళాలు పొందుతూ.. సేవలు చేస్తూనే.. కొన్ని సంస్థలు మత ప్రచారాలను కూడా చేస్తున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో.. వాటిని అరికట్టేందుకు విదేశీ చట్టం కింద వీటి రిజిస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసింది. ఏపీలో పలు సంస్థలు, హైదరాబాద్‌లో చర్చ్‌లు, విద్యాసంస్థలు, సేవా భారతి, హైదరాబాద్ ఆర్చ్ డియోసెస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ (ఎస్‌హెచ్‌ఎఫ్), గ్రామీణ విద్య మరియు అభివృద్ధి సంఘం, రాయపాటి ఛారిటబుల్ అసోసియేషన్, ఫిలడెల్ఫియా జియాన్ మినిస్ట్రీస్ మొదలగున వాటిని కేంద్రం రద్దు చేసింది.

విదేశాల నుంచి ఏ మేరకు నిధులు వచ్చాయో..? వాటి వివరాలు ఏంటో.? అనే విషయాలేవీ ఇప్పటివరకు ఈ సంస్థలు కేంద్రానికి తెలియకుండా దాచిపెట్టాయనే ఆరోపణలు ఉన్నాయట.