Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇరు రాష్ట్రాలకు కొత్తగా 18 మంది ఐఏఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఏపీకి 11 మంది, తెలంగాణకు తొమ్మిది మంది ఐఏఎస్‌లను కేటాయిస్తూ.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఐఏఎస్‌ల కొరత ఉంది. పరిపాలనకు అవసరమైన మేర కంటే తక్కువ మంది ఐఏఎస్‌లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయడానికి ఉన్నతాధికారులు కరువయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు మరికొంతమంది ఐఏఎస్‌లను కేటాయించడం ఆనందించదగ్గ విషయం.

ఇక ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ల లిస్ట్‌లో సూర్య సాయి ప్రవీణ్ చంద్, భావన, మల్లారపు నవీన్, వీ. అభిషేక్, అపరాజితా సింగ్, జైకుమరన్, విష్ణు చరణ్, నిధి మీన, కట్టా సింహాచలం, వికాస్ మర్మత్, చాహట్ భాజ్‌పయ్‌లు ఉన్నారు. అలాగే తెలంగాణకు క్రాంతి వరుణ్ రెడ్డి, చిత్రా మిశ్రా, పాటిల్ హేమంత్ కేశవ్, గరిమా అగర్వాల్, దీపక్ తివారి, అంకిత్, ప్రతిమా సింగ్‌లు ఖరారయ్యారు. ఇక వీరంతా  2019 బ్యాచ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు కావడం గమనార్హం.