కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు

కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అకస్మాత్తుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కల్వడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. రాష్ట్రపతిని కలిసి గంటన్నర సేపు చర్చలు...

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు
Follow us

|

Updated on: Jul 05, 2020 | 4:15 PM

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అకస్మాత్తుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కల్వడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. రాష్ట్రపతిని కలిసి గంటన్నర సేపు చర్చలు జరిపిన ప్రధాన మంత్రి కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి వివరించినట్లు సమాచారం.

దేశంలో కరోనా వైరస్ విపరీతమైన వేగంతో వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మరో రెండు, మూడు నెలల్లో పరిస్థితిపై అంఛనాలు, గాల్వన్ లోయలో తలెత్తిన ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితిని, తాను రెండు రోజుల క్రితం లధాఖ్‌లో జరిపిన పర్యటన తాలూకు విషయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది.

ప్రధాన అంశాలపై బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత జులై నెలాఖరులో జరపతలపెట్టిన కేంద్ర కేబినెట్ విస్తరణ అంశంపై రాష్ట్రపతితో మోదీ సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ ఏర్పాటై పదమూడు నెలలు గడిచిన నేపథ్యంలో పలువురి పనితీరుపై సమీక్ష జరిపి కొందరిని తొలగించడం, మరికొందరి శాఖలు మార్చడం వంటి అంశాలను ప్రధానమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో రాజకీయం రంగు మారడానికి, అత్తెసరు మెజారిటీతో కొనసాగుతున్న కమల్‌నాథ్ సర్కార్‌ను కూలదోసి, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పాటవడానికి ముఖ్య కారకుడైన జ్యోతిరాదిత్య సింధియాను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం దాదాపు ఖరారైనట్లు సమాచారం.