ఆత్మ నిర్భర్ పథకానికి రూ. 1548 కోట్లు, కేంద్ర కేబినెట్ నిర్ణయం, 58 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా దేశీయ స్వావలంబనకు ఉద్దేశించిన ఆత్మ నిర్భర్ పథకం..

ఆత్మ నిర్భర్ పథకానికి రూ. 1548 కోట్లు, కేంద్ర కేబినెట్ నిర్ణయం, 58 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 09, 2020 | 5:54 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా దేశీయ స్వావలంబనకు ఉద్దేశించిన ఆత్మ నిర్భర్ పథకం..భారత్ రోజ్ గార్ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1548 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఆ తరువాత మొత్తం పథకం కాలానికి రూ. 22,810 కోట్లు..అంటే 2020-2023 ఏళ్ళ మధ్య సుమారు 58.5 లక్షల మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. దేశంలో పబ్లిక్ డేటా సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. వీటికి లైసెన్స్ ఫీజు గానీ, రిజిస్ట్రేషన్ ఫీజుగానీ అవసరం లేదని తీర్మానించారు. అంటే ఏ విధమైన లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా పబ్లిక్ డేటా కార్యాలయాల ద్వారా పబ్లిక్ వై-ఫై సేవలను అందించడానికి సంబంధిత నెట్ వర్క్ ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీన్ని పబ్లిక్ వై-ఫై యాక్సెస్ నెట్ వర్క్. ఇంటర్ ఫేస్ ‘పీఎం వని’ గా వ్యవహరిస్తారు.

ఇంకా కొచ్చి-లక్షద్వీప్ మధ్య సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ వివరించారు.

ఆత్మ నిర్భర్ యోజన పథకం లోని కీలకాంశాలు

  1. 2020 అక్టోబరు 1 కి ముందు, లేదా ఆ తరువాత 2021 జూన్ 30 వరకు నియమితులైన కొత్త  ఉద్యోగులకు రెండేళ్ల పాటు ప్రభుత్వం సబ్సిడీనిస్తుంది.
  2. వెయ్యిమంది ఉద్యోగులలోపు ఉన్న సంస్థలలో కొత్తవారికి ఈ పీ ఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు సంబంధించి ప్రభుత్వం 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ని, సంస్థ యాజమాన్యం నుంచి ఇంతే కాంట్రిబ్యూషన్ ని చెల్లిస్తుంది.
  3.  వెయ్యి మందికి పైగా ఉద్యోగులున్న సంస్థల్లో రెండేళ్ల పాటు  కొత్తవారికి సర్కార్…. వారి ఈ పీ ఎఫ్ కాంట్రిబ్యూషన్ లో 12 శాతం మాత్రమే చెల్లిస్తుంది.
  4.  నెలకు 15 వేల రూపాయల లోపు వేతనం పొందుతున్నవారిలో..ఈపీఎఫ్ఓ కింద రిజిస్టర్ అయిన సంస్థలో ఈ ఏడాది అక్టోబరు 1 కి ముందు ఉద్యోగం చేస్తూ యూనివర్సల్ అకౌంట్ నెంబరు గానీ, ఈ పీ ఎఫ్ మెంబర్ అకౌంట్ గానీ లేకుండా ఉంటే వారికీ ఈ ప్రయోజనం కలుగుతుంది.
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..