పోలవరానికి మళ్లీ బ్రేకులు: ఏపీకి కేంద్రం నోటీసులు

AP Government, YS Jagan Mohan Reddy

ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పోలవరానికి చెందిన పర్యావరణశాఖ నిబంధనలను ప్రస్తావిస్తూ కేంద్రం వివరణ కోరింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని కేంద్రం ప్రశ్నించింది. అలాగే పురుషోత్తపట్నం ప్రాజెక్ట్‌పైనా వివరణ కోరింది.

అయితే పోలవరం, అనుబంధ ప్రాజెక్ట్‌లపై చెన్నై పర్యావరణ శాఖ అధికారులతో తనిఖీలు చేయించింది. ఆ నివేదికను అధికారులు కేంద్రానికి అందజేశారు. పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని ఆ నివేదికలో అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై చెన్నై పర్యావరణ అధికారులు గత జూలైలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో(ఎన్‌జీటీ)లో అఫిడవిట్ వేశారు. ఈ ఉల్లంఘనలపై ఏపీకి నోటీసులు జారీ అయ్యాయి. కాగా ఇటీవలే పోలవరానికి స్టాప్ వర్క్ ఆర్డర్‌ను రెండేళ్ల పాటు పొడిగించిన కేంద్రం.. మళ్లీ అనూహ్యంగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి ఈ ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కార్ వివరణను బట్టే పోలవరం ప్రాజెక్ట్ భవితవ్యం ఆధారపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *